ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: బస్సు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

Chandrababu: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి యాత్రికులు మృతి చెందడం బాధాకరమన్నారు. గాయపడినవారిని చింతూరు ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు ఆయనకు తెలిపారు. ఉన్నతాధికారులు తక్షణమే ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.



