ఆంధ్ర ప్రదేశ్
సింగపూర్‌లో రెండోరోజు కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన

సింగపూర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటించారు. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖలోని మానవ వనరులు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై మంత్రి టాన్ సీ లాంగ్ తో సీఎం చర్చించారు. రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానని మంత్రి టాన్ సీ లాంగ్ కు సీఎం స్పష్టం చేశారు. సింగపూర్‌పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్‌లో సింగపూర్ టౌన్‌షిప్ నిర్మించామని తెలిపారు.



