ఆంధ్ర ప్రదేశ్
ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ 2026 క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. జీవ వైవిద్యం-ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం అనే థీమ్‌తో రూపొందించిన క్యాలెండర్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమక్షంలో ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు ఆవిష్కరించారు.
ఏపీలోని ప్రకృతి సంపద, కళలు, సంప్రదాయాలు, ఆధునిక సాంకేతికతలకు అద్దం పట్టేలా కొత్త సంవత్సరం క్యాలెండర్ రూపొందించినట్లు అసెంబ్లీ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. వన్యప్రాణుల గురించి అవగాహన కల్పించేలా, సాంప్రదాయ కలంకారీ కళాశైలిలో క్యాలెండర్లోని చిత్రాలు వచ్చేలా డిజైన్ చేయించారు. డైరీ, క్యాలండర్ ఆవిష్కరణలో సీఎంతో పాటు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.



