ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: దుబాయ్‌ని చూస్తుంటే నాకు అసూయ వేస్తుంది

Chandrababu: విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ ఆ దేశాన్ని చూస్తుంటే తనకు అసూయ వేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. దుబాయ్‌లో ఎడారి ప్రాంతాలు, బీచ్‌లు పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయని అన్నారు.
యూఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం ఉండటం సంతోషకరమని అన్నారు. నూతనంగా ఆలోచించడం వల్లే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో భారత్‌కు అపార అవకాశాలు వచ్చాయన్నారు. వికసిత్ భారత్ ద్వారా 2047 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చంద్రబాబు అన్నారు.