ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారు

Chandrababu: సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 23 వరకు దావోస్‌లో జరగనున్న ఎకనామిక్ ఫోరం సదస్సుకి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ వెళ్లనున్నారు. అయితే దావోస్ పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలను కూడా సీఎం కలిసే అవకాశాలు ఉన్నాయి. ఏపీకి కావాల్సిన పెట్టుబడులపై పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు చర్చించే ఛాన్స్ ఉంది.



