ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: గత పాలకులు రాష్ట్రాన్ని పూర్తిగా విద్వంసం చేసి వెళ్లారు

Chandrababu: గత వైసీపీ ప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. గత పాలకులు రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో తాము ముందుకెళ్తున్నామని వెల్లడించారు. పేదల పెన్షన్లు 3వేల నుంచి 4వేలకు పెంచామని చెప్పారు.
గతంలో కూడా పెన్షన్ 200 రూపాయలు ఉంటే ఒకేసారి 2వేలకు తామే పెంచినట్టు వెల్లడించారు చంద్రబాబు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చంద్రబాబు పర్యటించారు. ఇందులో భాగంగా స్థానిక ఎన్‌టీఆర్ పార్క్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో సీఎం ముఖాముఖిలో పాల్గొన్నారు. అనంతరం తణుకు కూరగాయల హోల్‌సెల్ మార్కెట్‌ను పరిశీలించారు.



