ఆంధ్ర ప్రదేశ్
నేడు మరోసారి చంద్రబాబు, పవన్ భేటీ

నేడు మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూట సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. సమావేశానికి బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ హాజరు కానున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కూటమి నేతలు భేటీ కానున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చించనున్నారు.
భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. నామినేటెడ్ పదవులు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చ జరగనుంది. నిన్న రెండున్నర గంటల పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం జరిగింది.



