ఆంధ్ర ప్రదేశ్
Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే..

Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్. సిఎం చంద్రబాబు 11.00 గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్రంలో విమానాశ్రయాల విస్తరణ, కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటు అంశంపై సమీక్ష చేస్తారు. కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు ఆన్లైన్ విధానంలో ఈ సమీక్షకు హాజరు అవుతారు.
అనంతరం 1.20 గంటలకు విజయవాడలోని గణపతి సచ్చితానంద స్వామి ఆశ్రమానికి వెళతారు. అక్కడినుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లి హైదరాబాద్ వెళతారు. సాయంత్రం 5.00 గంటలకు హైదరాబాద్ హైటెక్స్ లో వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సదస్సుకు సిఎం చంద్రబాబు హాజరు అవుతారు.