ప్రభాస్ అంటే ఉప్పొంగిపోతున్న బ్యూటీ!

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న శాండల్‌వుడ్ బ్యూటీ చైత్ర జె ఆచార్ ప్రభాస్ గురించి మురిసిపోతూ మాట్లాడింది.
యువ దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ చిత్రంలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న కన్నడ భామ చైత్ర జె ఆచార్ ప్రభాస్‌తో కలిసి పనిచేస్తున్న అనుభవం గురించి ఆనందంగా పంచుకుంది. “ప్రభాస్‌తో పనిచేయడం నాకు గొప్ప అవకాశం. ఇంత పెద్ద ప్రొడక్షన్ ఎలా పనిచేస్తుందో, సెట్‌లో రిథమ్, క్రాఫ్ట్, డీటెయిలింగ్ అన్నీ నేర్చుకుంటున్నాను” అని చైత్ర చెప్పింది.
తన పాత్ర కథలో చాలా ముఖ్యమైనదని, పాత్ర పరిమాణం కంటే సినిమా స్థాయి ముఖ్యమని ఆమె అన్నారు. ప్రభాస్ తన నటనను ముందే చూసి మెచ్చుకున్నాడని చైత్ర ఆనందంగా చెప్పింది. “నేను ప్రభాస్ ‘మిర్చి’ సినిమాకు పెద్ద ఫ్యాన్‌ని కనీసం 25 సార్లు చూశాను” అని ఆమె ఉప్పొంగిపోయింది. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.



