తెలంగాణ
Ponnam Prabhakar: టిప్పర్ రాంగ్ రూట్లో రావడం వల్లే ప్రమాదం

Ponnam Prabhakar: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే రంగారెడ్డి కలెక్టర్, ఆర్టీసీ ఎండీలతో టెలిఫోన్ ద్వారా మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. టిప్పర్ రాంగ్‌రూట్‌లో రావడంతోనే ఈ విషాదం చోటుచేసుకుందని మంత్రి తెలిపారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.



