ఆంధ్ర ప్రదేశ్సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, అనగనగా ఒక రాజు చిత్ర బృందం, నటుడు శివబాలజీ స్వామివారిని వేరు వేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.



