ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

Tirumala: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారిని ఎంపీ సీఎం రమేష్, టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు జాగ్రత్తతో తుఫాన్ నష్టం తగ్గిందని శ్రీవారి అనుగ్రహంతో చిన్న విపత్తుతో తప్పించుకున్నామన్నారు. ఇక ప్రముఖ డ్రమ్స్ ప్లేయర్ శివమణి కూడా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.



