ఆంధ్ర ప్రదేశ్
Tirumala: శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

Tirumala: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో మెగాస్టార్ చిరంజీవి సహోదరి మాధవి రావు, ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎంపీ మాగుంట శ్రీనివాస్, తెలంగాణ ఎంపీ రఘునందన్ రావులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.



