సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ నటులు సుహాస్, అశ్విన్ బాబు, ఆది, ప్రముఖ సంగీత దర్శకుడు థమన్, డ్రమ్స్ శివమణిలు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
ఆలయం వెలుపల సుహాస్ మీడియాతో మాట్లాడుతూవెట్రిమారన్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న సినిమా షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు. సినిమా ప్రారంభం సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నామని అన్నారు. తెలుగులో కూడా ఓ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు చెప్పారు.