సినిమా
ఫౌజీ విడుదల తేదీపై క్రేజీ అప్డేట్?

Fauji: రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదీపై క్రేజీ అప్డేట్ వచ్చింది.
ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. 2026 ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ప్రభాస్ ఈ సినిమాలో సైనికుడి పాత్రలో కనిపించనున్నారు.
హను రాఘవపూడి గత చిత్రం సీతారామం సక్సెస్ తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి హైప్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. ప్రభాస్ రగ్గడ్ లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులను ఆకట్టుకోనున్నాయి. ఈ బిగ్ బడ్జెట్ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.



