తెలంగాణ

Hyderabad: శంషాబాద్ ORR పైన కార్ల రేసింగ్.. ప్రమాదకర స్టంట్లు చేసిన యువకులు

Hyderabad: హైదరాబాద్ శంషాబాద్ ORR పైన జరిగిన కార్ల రేసింగ్‌పై పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రమాదకర స్టంట్లు చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. ఆ ఇద్దరు యువకులు నాంపల్లి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఇటీవల పెద్ద గోల్కొండ-తోండుపల్లి మధ్య యువకులు ప్రమాదకర స్టంట్లు చేశారు.

దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ రేసింగ్ వీడియోలు సోషల్ మీ డియాలో వైరల్‌గా మారాయి. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button