ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. తెలంగాణ భక్తులకు గాయాలు

Tirumala: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. శ్రీవారి దర్శనానికి వెళ్తున్న ఓ వాహనానికి మొదటి ఘాట్ రోడ్డులోని 19వ మలుపు దగ్గర ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన స్కార్పియో వాహనం డివైడర్‌ని ఢీ కొట్టి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులు గాయాల పాలయ్యారు. కారులో ఉన్న మరి కొందరు క్షేమంగా బయటపడ్డారు.