తెలంగాణ
Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్

Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‌కు కౌశిక్ రెడ్డిని తరలిస్తున్నారు. కాసేపట్లో కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపర్చనున్నారు.
గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బులివ్వాలని తన భర్త మనోజ్‌ను బెదిరించారని సుబేదారి పీఎస్‌లో మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు చేశఆరు. కౌశిక్ రెడ్డిపై 308 (2), 308 (4), 352 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.