తెలంగాణ
బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ ఆత్మహత్య

హైదరాబాద్ బోరబండలో కాంగ్రెస్ కార్పొరేటర్ అరాచకలు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వేధింపులు తాళలేక బీఆర్ఎస్ నేత ఆత్మహత్య చేసుకు న్నాడు. బాబా ఫసియుద్దీన్ అరాచకాలు, వేధింపులు తాళలేక బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
అంతేకాదు తన అధికార బలంతో ఇటీవల సర్దార్ ఇంటిని సైతం బాబు ఫసీయుద్దీన్ కూల్చివేయించారని సమాచారం. అన్నీవైపుల నుండి వేధింపులు రావడంతో ఒత్తిడి తట్టుకోలేక సర్దార్ సూసైడ్ చేసుకున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
సర్దార్ ఆత్మహత్య చేసుకోవడంతో బోరబండలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పీఎస్ ఎదుట బాధిత కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బాబా ఫసీయుద్దీన్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం కావాలంటూ పోలీసుల ఎదుట కన్నీరుమున్నీరయ్యారు.