ఆంధ్ర ప్రదేశ్
Eluru: విరబూసిన బ్రహ్మకమలాలు

Eluru: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో బ్రహ్మకమలాలు పుష్పాలు కనువిందు చేశాయి. పట్టణానికి చెందిన కరుటూరు సుబ్బారావు అనే వ్యక్తి సంవత్సరం క్రితం హైదరాబాదు నుండి బ్రహ్మకమలం మొక్కను తీసుకువచ్చి పెరటిలో నాటారు.
కేవలం రెండు లేదా మూడు పుష్పాలు మాత్రమే పూచే మొక్కకి ప్రస్తుతం పదిపదుల సంఖ్యలో బ్రహ్మకమల పుష్పాలు పూయ్యడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మకమలాలకు దేవుని పూజలో ప్రత్యేక స్థానం ఉన్నట్లు తెలిపారు. బ్రహ్మకమాలను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు.



