ఆంధ్ర ప్రదేశ్
Botsa Satyanarayana: అసంబద్ధ హామీలతో అందలం…చంద్రబాబు పవన్ తోడు దొంగలు

Botsa Satyanarayana: అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో అసంబద్ధ హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని పార్టీ కార్యీకర్తలకు పిలుపునిచ్చారు. మండపేటలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల మేనిఫెస్టోను తుంగలో తొక్కారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా మహిళలు, రైతులు మోసపోతారని విమర్శించారు.