ఆంధ్ర ప్రదేశ్
Botsa Satyanarayana: ప్రజారోగ్యాన్ని కూటమి సర్కార్ గాలికొదిలేసింది

Botsa Satyanarayana: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.ప్రజలకు వివరించి కోటి సంతకాల సేకరణ చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై చర్చించామని చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలను పూర్తి చేశామని స్పష్టం చేశారు.



