తెలంగాణ
బేగంపేట్ ఎయిర్ పోర్టుకి బాంబు బెదిరింపు

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపుల కలకలం రేగింది. తాజాగా బేగంపేట్ ఎయిర్ పోర్టుకి బాంబు బెదిరింపు వచ్చింది. దుండగుడి ఈమెయిల్‌తో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సమాచారం మేరకు హుటాహుటిన చేరుకున్న బాంబ్ అండ్ డాగ్ స్వ్కాడ్ ముమ్మర తనిఖీలు చేసింది. క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం విమానాశ్రయంలో బాంబు లేదని తేల్చారు.