ఆంధ్ర ప్రదేశ్
Naveen Kumar Reddy: భక్తుల రద్దీని అంచనా వేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైంది

Naveen Kumar Reddy: తిరుమల ఘటనపై బీజేపీ నాయకుడు నవీన్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల రద్దీని అంచనా వేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం శ్రీవారి భక్తుల పాలిట శాపంగా మారిందని నవీన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి మృతుల సంఘటనను NHRC సుమోటోగా స్వీకరించాలని ఆయన కోరారు.
ఆరుగురు శ్రీవారి భక్తుల మృతికి కారణమైన వారిపై ఎటువంటి కేసులు పెడతారని ఆయన ప్రశ్నించారు. శ్రీవారి భక్తులు టోకెన్ల కోసం తొందరపడకుండా టిటిడి ధర్మకర్తల మండలి,టీటీడీ ఉన్నతాధికారులు,పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు భక్తులంతా సంయమనం పాటించి రాబోవు రోజులలో సహకరించాలని బీజేపీ నాయకుడు నవీన్ విజ్ఞప్తి చేశారు.