Solo Boy: బిగ్ బాస్ గౌతమ్ ‘సోలో బాయ్’.. విడుదలకు రెడీ!

Solo Boy: బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ నటించిన ‘సోలో బాయ్’ సినిమా రిలీజ్ కాబోతోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం యూత్‌ను ఆకర్షించేందుకు సిద్ధం అయ్యింది.
బిగ్ బాస్‌తో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. నవీన్ కుమార్ డైరెక్షన్‌లో, సెవెన్ హిల్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాలో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోసాని కృష్ణ మురళి, అనిత చైదరి, షఫీ వంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రల్లో కనిపించనుంది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ వైబ్‌తో రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ లుక్, మెలోడీ సాంగ్స్‌తో యూత్‌లో హైప్ పెంచింది.
తాజా పోస్టర్‌లో గౌతమ్, రమ్యల రొమాంటిక్ కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంటోంది. జూలై 4న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ మూవీ యూత్‌ఫుల్ కథ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించనుంది. ‘ఆకాశ వీధుల్లో’తో ఆకట్టుకున్న గౌతమ్ ఈ సినిమాతో మరోసారి సక్సెస్ సాధిస్తాడా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.