ఆంధ్ర ప్రదేశ్
సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన ముద్రగడ పద్మనాభరెడ్డి

సీఎం చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ రాశారు. మీ పాత రాజకీయ స్నేహితుడు ముద్రగడ అంటూ లేఖలో రాసుకొచ్చారు. ‘1995 టీడీపీలో పని చేశాను అప్పటి మీ పాలనలో రాజకీయ కక్షలు, అక్రమ కేసులు బనాయించలేదు. అందుకే పాత స్నేహితుడంటూ అభివర్ణించానని తెలిపారు. మీ కుమారుడు లోకేష్ రెడ్ బుక్ పేరుతో బీభత్సం సృష్టించి అక్రమ కేసులు బనాయిస్తున్నారు.. ఇది మంచి పద్ధతి కాదని, లోకేష్‌కి విషయం అర్థమైనట్టు చెప్పాలని రాసుకొచ్చారు.
అధికారం.. ఆస్తులు ఎప్పుడు సొంతం కాదని, తిరిగి జగన్ అధికారంలోకి వస్తారని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేయాలని అనుకోలేదన్నారు. దెబ్బతిన్న కార్యకర్తలు విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడితే పరిస్థితులు వేరేలా ఉంటాయని మనసులోని మాట బయటపెట్టారు.