అంతర్జాతీయం

ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాలపై దాడులు

Australia: భింద్రన్‌‌వాలేతో అంతమైపోయిందనుకొన్న ఖలిస్తాన్‌ ఉద్యమం మళ్లీ సరికొత్త రూపంలో భారత్‌ను ఇబ్బంది పెట్టనుందా..? అంటే అవునన్నట్టే కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు. భారత వ్యతిరేక శక్తులు విదేశాల్లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఖలిస్తానీల పేరుతో బ్రిటన్‌‌, ఫ్రాన్స్‌‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తీవ్రవాదశక్తులు భారత వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయి.

ఏదో రకంగా భారతదేశాన్ని దెబ్బ తీయాలి ఇక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అదానిని రోడ్డు మీదకి లాగి స్టాక్ మార్కెట్ ని కూలదోయాలి మత కల్లోలాలు సృష్టించి దేశాన్ని ఆర్ధికంగా కృంగదీయాలి ఇవే ఇప్పుడు వాళ్ల ఎజెండాలుగా కనిపిస్తున్నాయి. మరీ ఖలిస్తాన్ తీరుపై భారత్ ఏ విధంగా స్పందిస్తోంది. వారి అంతానికి మోదీ చేస్తున్న వ్యూహాం ఏంటి..?

ఆస్ట్రేలియాలో ఖలిస్తానీయులు రెచ్చిపోతున్నారు. భారతదేశ అంతమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. సందుదొరికితే చాలు హిందూ దేవాలయాలపై దాడులు.. హిందూవులపై దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాల్లో కూడా జెండా వందనం కార్యక్రమాలు సంబరంగా జరిగాయి. రాయబార కార్యాలయాల్లో కూడా జెండా వందనం కార్యక్రమాలు సంబరంగా జరిగాయి. అయితే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం వద్ద జరిగిన భారత్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఖలిస్థానీ అనుకూల వ్యక్తులు అడ్డుతగిలారు.

వేడుకలను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు భారతీయులు శాంతియుతంగా కాన్సులేట్ కార్యాలయం ముందు గుమిగూడ ఉండి వారంతా దేశభక్తి గీతాలు ఆలపిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఖలీస్థానీలు వేడుకల్లోకి చొరబడి తమ జెండాలు ఊపుతూ భారత వ్యతిరేక నినాదాలు చేశారు. ముఖం కనిపించకుండా వారంతా వస్త్రాలను కప్పుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అయితే వెంటనే ఆస్ట్రేలియా పోలీసులు జోక్యం చేసుకోవడం పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరగడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఓ వర్గం ఖలీస్థాన్ అనుకూల నినాదాలు చేస్తుండగా మరో వర్గం దేశభక్తి గీతాలతో వారికి కౌంటర్ ఇస్తోంది. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చిన అనంతరం త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు.

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆటంకం కలిగించిన ప్రో-ఖలిస్థాన్ వ్యక్తులు ఆస్ట్రేలియాలో ఆగడాలకు పాల్పడడం కొత్తేమీ కాదు. అయితే, అవి మరింత పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో భారత్‌ను లక్ష్యంగా చేసుకొని విద్వేష నేరాలకు పాల్పడుతున్నారు. గత నెలలో, ఆస్ట్రేలియాలోని బొరోనియాలో ఉన్న స్వామినారాయణ దేవాలయాన్ని ఖలిస్థానీ వేర్పాటువాదులు ధ్వంసం చేశారు.

దేవాలయం గోడపై విద్వేషపూరిత రాతలు రాశారు. దేవాలయానికి సమీపంలోనే ఉన్న రెస్టారెంట్లపై కూడా ఈ విధమైన నినాదాలను గోడలపై రాశారు. అక్కడితో ఆగకుండా మిగిలిన గోడలకు ఖలిస్థాన్‌ జెండా గుర్తులను అతికించారు. ఈ రెస్టారెంట్లను ఆసియా దేశాలకు చెందిన వ్యక్తులు నిర్వహిస్తున్నారు.

దీనికి ముందు కూడా 23 ఏళ్ల ఓ భారతీయ విద్యార్థిపై జాత్యహంకార దాడి చోటుచేసుకుంది. విద్యార్థిని ఖలిస్థాన్ మద్దతుదారులు ఇనుప రాడ్లతో విచక్షణరహితంగా దాడి చేశారు. ఖలిస్థాన్‌ చర్యలను వ్యతిరేకించినందుకు ఈ దాడికి పాల్పడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

ఆ విద్యార్థి కారు డ్రైవర్‌గా పనిచేస్తూ చదువు కొనసాగిస్తున్నాడు. కారు తీస్తుండగా, నలుగురు ఖలిస్థాన్‌ మద్దతుదారులు తనను అడ్డుకొని దాడికి దిగారిని బాధితుడు తెలిపాడు. ఖలిస్థాన్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారని చెప్పాడు. బాధితుడి తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు వెల్లడించారు.

ఈ తరహా విధ్వేష ఘటనలు క్రమంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఖలిస్థాన్ అనుకూలవాదులను ప్రోత్సహించొద్దంటూ కేంద్ర ప్రభుత్వం పదేపదే కోరుతోంది. తరుచూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తోన్న భారతీయులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ తరహా తీవ్రవాద, విభజన వాద భావజాలాలు మాకు, మీకు మంచిది కాదు. ద్వైపాక్షిక సంబంధాలకు కూడా మంచిది కాదని భారత విదేశాంగ మంత్రి ఎస్.

జయశంకర్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య ధ్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ దేశంలో నివసిస్తున్న భారతీయులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఆస్ట్రేలియాలో ఖలిస్థాన్‌ అనుకూలవాదులు తమ కార్యకలాపాలను ఉద్ధృతం చేస్తున్నట్లు స్పష్టమైన సమాచారం ఉన్న నేపథ్యంలో అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని భారత్‌ కోరింది.

మరోవైపు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌ భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. భారత్‌తో స్నేహ బంధం ఎన్నోఏళ్లుగా కొనసాగుతోందని భారత్‌ సాధించిన విజయాన్ని తాము కూడా నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యంగా కెనడాలో ఖలిస్థానీయులు ఎక్కువగా ఆందోళనలు చేస్తుంటారు. భారతీయులతో గొడవలకు దిగుతారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా అది కూడా స్వాంతత్ర్య దినోత్సవం రోజున జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాగా 1857లో నాటి బ్రిటీష్‌‌ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో యావత్‌‌ భారతంలోని అన్ని వర్గాలు ప్రజలు పాల్గొన్నారు. ఆ ఉద్యమ సునామీ బ్రిటీషర్ల వెన్నులో వణుకు పుట్టించింది. అంతకుముందు తమకు సునాయాసంగా లొంగిపోయిన ఇక్కడి స్వదేశీ సంస్థానాధీశులు, ప్రజల్లో ప్రాంతాలు, మతాలకతీతంగా ఏర్పడిన ఐకమత్యం చూసి ఖంగుతిన్నారు. అందుకే మన మోకాళ్లను విరవాలనుకున్నారు.

ఈసారి శక్తితో కాకుండా యుక్తికి పదునుపెట్టారు. అనుకున్నదే తడవుగా మాక్స్‌‌ ఆర్థర్‌‌ మెకాలిఫ్‌‌ అనే ఐర్లాండ్‌‌ దేశంలో పుట్టిన బ్రిటీష్ తైనాతీని ఆగమేఘాల మీద భారత్‌‌కు రప్పించారు. గురుగోవింద్‌‌ సింగ్‌‌, రంజిత్‌‌సింగ్‌‌, ఫతేసింగ్‌‌, జొరావర్‌‌సింగ్‌‌, అర్జున్‌‌దేవ్‌‌ వంటి సిక్కు గురువుల స్ఫూర్తితో దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే సిక్కు మతస్తులను హిందువుల నుంచి వేరుచేసే కుట్రకు తెరలేపారు.

మెకాలిఫ్‌‌ ఐర్లాండ్‌‌లో పుట్టినా ఆంగ్లేయ మనస్తత్వం జీర్ణించుకున్న తెల్లతోలు గుంట నక్క. అతడు అమృత్​సర్‌‌లో అడుగుపెట్టి సిక్కుగా మతం మార్చుకున్నాడు. ఆ కాలంలో ఒక ఆంగ్లేయుడు సిక్కుగా మారడం భారత సిక్కులకు ఆశ్చర్యం కలిగించింది. కానీ అందులోని కుట్రను వారు గ్రహించలేకపోయారు. మెకాలిఫ్‌‌ తన టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ఉపయోగించి భాయ్‌‌ కహ్న్​సింగ్‌‌ నాభా అనే సిక్కును ప్రభావితం చేశాడు.

1897 నాటికి ఈ సిక్కు సూడో మేధావి కలంతో హమ్‌‌ హిందూ నహీ అన్న పుస్తకం రాయించాడు. ఆనాడే ఖలిస్తాన్‌‌కు బీజం పడింది. హిందూ ధర్మానికి బాహువుల్లా ఉన్న సిక్కుల్లో ‘మేం వేరు’ అనే భావన కలిగించారు. 1 మే 1905 నాడు అమృత్​సర్‌‌ సరోవరంపై ఉన్న హిందూ దేవీదేవతల విగ్రహాలు తొలగించబడ్డాయి. 1901 జనాభా లెక్కల నాటికి 10 లక్షలు ఉన్న సిక్కు జనాభా1911 జనాభా లెక్కల నాటికి 300 రెట్లు పెరిగింది.

సిక్కులకు ప్రత్యేక దేశమే లక్ష్యంగా ఖలిస్తాన్ ఉద్యమం చేస్తోంది. కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల అండగా భారత్ లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వ మద్దతుతో రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఖలీస్తాన్ మద్దతుదారులపై విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయినా ఖలిస్తాన్ మద్దతుదారులు వినిపించుకోవడం లేదు. మరీ దినిపై నరేంద్ర మోదీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button