ఆంధ్ర ప్రదేశ్
AP News: పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

AP News:పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భర్త చనిపోతే వెంటనే భార్యకు పింఛన్ మంజూరు చేయాలని నిర్ణయించింది. దీంతో కొత్తగా ఇవాళ 5వేల 42 మంది వితంతులు పెన్షన్ తీసుకోనున్నారు. అయితే గతంలో ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్ల మంజూరు అయ్యేది. ఇక కూటమి ప్రభుత్వం రాగానే పెన్షన్ మంజూరులో మార్పు చేసింది.
ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో మూడు నెలలుగా వివిధ కారణాలతో పెన్షన్ తీసుకోని 50వేల మంది లబ్ధిదారులు.. ఇవాళ తీసుకోనున్నారు. మరోవైపు ఏపీలో ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇవాళ్టి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.



