AP: ప్రైవేట్ చేతుల్లోకి ఏపీ రోడ్లు!

AP: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లను బాగుచేసేందుకు పీపీపీ మోడ్ సరైనదని ప్రభుత్వం బావిస్తోంది. రోడ్లపై జరిగిన సమీక్షలో ఆర్ అండ్ బీ అధికారులు స్టేట్ హైవేస్‌ను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ పద్దతిలో నిర్మించేందుకు చంద్రబాబు ముందు ప్రపోజల్ పెట్టారు. స్టేట్ హైవేస్‌ను పీపీపీ మోడ్‌లో డెవలప్‌చేసేందుకు సీఎం అంగీకరించారు.
రోడ్లను ప్రైవేట్ వాళ్లు నిర్మించి, రిపేర్లు చేసి నిర్ణీత కాలం వరకు పర్యవేక్షణ కూడా వాళ్లే చేయనున్నారు. తొలిదశలో 18 రోడ్లను ప్రైవేట్ పద్దతిలో చేపట్టేందుకు డీపీఆర్ రూపొందుతున్నట్లు సమాచారం. 1307 కిలోమీటర్ల రోడ్లు పీపీపీ మోడ్‌లో తొలిదశలో అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు తయారవుతున్నాయి.
రోడ్లను పీపీపీ మోడ్‌లో నిర్మించేందుకు కావాల్సిన విధి విధానాలు రూపొందించేప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా టోల్ పాలసీ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రోడ్లపై రోజువారీ తిరిగే సమీప ప్రాంతాల రైతులకు టోల్ లేకుండా చూడాలని నిర్ణయానికి వచ్చారు.
కమర్షియల్ వాహనాలకు టోల్ మోత తప్పదు. కూటమి సర్కార్ తీసుకొస్తున్న పీపీపీ మోడ్‌పై ఇప్పటికే ప్రతిపక్ష వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ పద్దతిలో నిర్మిస్తున్నారని వైసీపీ ఆందోళనలు చేస్తోంది. తాజాగా రోడ్లను పీపీపీ మోడ్‌లోకి తీసుకువస్తుండటంపై కూడా వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది.



