Kingdom: కింగ్‌డమ్ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Kingdom: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్‌డమ్ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమైంది. టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కింగ్‌డమ్ సినిమా ఈ నెల 31న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం 130 కోట్లతో రూపొందింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, ఓటీటీ రైట్స్ ద్వారా 50 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చిత్రానికి టికెట్ రేట్ల పెంపునకు జీవో జారీ చేసింది.
సింగిల్ స్క్రీన్‌లో 50 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో 75 రూపాయలు జీఎస్టీతో సహా పెంచుకునేందుకు అనుమతి లభించింది. రిలీజ్ అయిన తొలి పది రోజులు ఈ రేట్లు వర్తిస్తాయి. తెలంగాణలోనూ టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఉంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.