జాతియం
Delhi: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం

Delhi: నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చికిత్స నిమిత్తం పలువురు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.