ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: సంక్రాంతి నుంచి అన్ని సేవలూ ఆన్‌లైన్‌లోనే

Chandrababu: వచ్చే సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పౌరులకు అన్ని సేవలూ ఆన్‌లైన్‌లోనే అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ దిశగా ఆయా శాఖలన్నీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్టీజీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి నుంచి ప్రజలకు అన్ని సేవలు ఆన్ లైన్‌లోనే అందజేయాలన్నారు.
ఆన్‌లైన్‌లో సేవలు అందించడం ద్వారా ప్రజలకు సేవలు పారదర్శకంగా అందడంతో పాటు వారిలో ప్రభుత్వ పని తీరు పట్ల సంతృప్త స్థాయి పెరుగుతుందన్నారు. ఇప్పటికీ కొన్ని శాఖలు భౌతికంగానే సేవలందిస్తున్నాయని అలాంటి శాఖలు వెంటనే తమ పంథా మార్చుకుని ప్రజలకు ఆన్‌లైన్‌లో సేవలందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు.



