చదువు

AP : ఆంధ్రప్రదేశ్‌లో 3 నాలెడ్జ్‌ సిటీలు.. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి.. నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన ప్రథమ లక్ష్యం

knowledge cities in Andhra Pradesh : విద్య, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో.. నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన ఆధారిత విద్య ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. కృత్రిమ మేధ (AI) యూనివర్సిటీ, Artificial intelligence జాతీయ కేంద్రం, మూడు నుంచి ఐదు ప్రపంచ స్థాయి మల్టీ వింగ్స్‌ విద్య, పరిశోధన యూనివర్సిటీల ఏర్పాటుతో అమరావతి (Amaravati), విశాఖపట్నం (Visakhapatnam), తిరుపతి (Tirupati) నగరాలను నాలెడ్జ్‌ సిటీలుగా అభివృద్ధి చేయనుంది. స్వర్ణాంధ్ర-2047 విజన్‌ లక్ష్యాల్లో భాగంగా విద్య, నైపుణ్యాభివృద్ధిలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించింది. 2029, 2047 నాటికి సాధించాల్సిన స్థూల లక్ష్యాలను నిర్ణయించింది. పాఠశాల, ఉన్నతవిద్యను నైపుణ్య కోర్సులతో అనుసంధానం చేయనుంది. ఇందులో భాగంగా 6-8 తరగతుల్లో వృత్తి విద్య కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇవి ఉన్నత విద్య వరకు కొనసాగుతాయి.

రాష్ట్రంలో విదేశీ విద్యాసంస్థల ప్రాంగణాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విదేశీ విద్యాసంస్థలు క్యాంపస్‌లు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకురానుంది. పరిశ్రమలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో పరిశోధన, సృజనాత్మకత, వ్యవస్థాపకతో కూడిన పెటెంట్‌ సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించడంతో పాటు ఇంటర్న్‌షిప్‌లను తప్పనిసరి చేయనున్నారు. 100 శాతం నైపుణ్య అవసరాలను తీర్చేందుకు 26 స్కిల్‌ కాలేజీలు, 350 హబ్స్, 150పైన స్పోక్స్‌ కేంద్రాలతో కలిపి తిరుపతిలో స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు.

గూగుల్‌ పెట్టుబడుల కేంద్రంగా విశాఖపట్నం: మంత్రి నారా లోకేశ్‌

గూగుల్‌ సంస్థ పెట్టుబడులకు విశాఖపట్నం కేంద్రంగా మారనుందని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో గూగుల్‌ ఉన్నతస్థాయి ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగింది. ఆర్సెలార్‌ మిత్తల్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, భారత్‌ ఫోర్జ్‌ వంటి భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ప్రభుత్వంతో ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించేందుకు గూగుల్‌ ప్రతినిధి బృందం వచ్చింది అని పేర్కొన్నారు.

విశాఖ సిగలో ఐటీ హారం

తొలుత ఇన్ఫోసిస్‌.. ఆ తర్వాత టీసీఎస్‌.. తాజాగా గూగుల్‌.. ఇలా వరుసగా దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖపట్నంను ఎంచుకుంటున్నాయి. గూగుల్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) వల్ల విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) డేటా క్లౌడ్‌ సెంటర్‌ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే గూగుల్‌ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో అనుకూలతలు పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గూగుల్‌ వచ్చాక ప్రపంచంలోని పెద్దపెద్ద సంస్థలు కూడా రానున్నాయని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button