తిరుమలలో శ్రీవారి లాంటి మరో ఆలయం

Tirumala: పచ్చని హరిత తోరణాలు చుట్టూ ఎత్తైన పర్వతాలు.. ఎటు చూసిన ప్రకృతి రమణీయత, దైవ కళ ఉట్టిపడేలా నిత్యం గోవిందా నమః సంకీర్తన. స్వామి వారి వైభవాన్ని చాటే ఆనంద నిలయం తిరుమల. అందుకే మహర్షులు, పురాణ ఇతిహాసాలలో పేర్కొనబడినట్లుగా సకలసృష్టిలో వేంకటాచల పర్వతాన్ని మించిన పర్వతం మరొకటి లేదు.
అయితే మనం చూస్తున్న శ్రీవారి ఆలయాన్ని పోలిన మరో ఆలయం ఉందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విశ్వ కర్మ శిల్ప సంపద ఉట్టిపడేలా ఆ ఆలయం నిర్మాణం అయిందట.. ఇంతకీ తిరుమలలో అంతటి ఆలయం ఎక్కడ ఉంది..?
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు వెలసిన దివ్యక్షేత్రం తిరుమల. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు. ఆపద మొక్కులవాడా.. అనాథ రక్షకా.. గోవిందా.. గోవిందా.. అంటూ.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం.. నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తారు. స్వామి వారి దర్శనం.. జన్మజన్మల పుణ్యఫలంగా భావించి శ్రీనివాసుడిని సేవిస్తున్నారు లక్షలాది మంది భక్తులు. తరతరాల తిరుమలా తనివారని మహిమలా.. యుగ యుగాల.. జగ జగాల.. హృదయ డోలలా శ్రీవేంకటేశ లీలలా.. ఇలా..ఎన్నో మరెన్నో ఇక్కడ నిక్షిప్తం అయ్యాయి.
స్వామి వారి వైభవాన్ని తెలుసుకోవాలంటే సామాన్య మానవులకు అర్థం కాదనే చెప్పాలి. మానుష జన్మం సంపూర్ణం కావాలంటే శ్రీవారి పాద పద్మాలను సేవించడం ముక్తి మార్గంకు బాట వేస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఆపద మొక్కులవాడై అభయము ప్రసాదించే వాడై అర్చావతారా మూర్తిగా కలియుగంలో ఆనంద నిలయంలో కొలువైన స్వామి దుష్టశిక్షణ శిష్ట రక్షనార్థం మానవులను కాపాడేందుకు వెలిశారు స్వామి.
అయితే దేవతలు, ఋషులు, మహనీయులైన సాధువులకు స్వామి వారు మరో ఆలయాన్ని నిర్మించుకున్నారట. దీంతో మానవులకు ఆ ఆలయం కనపడుతుందా…? అసలు ఆ ఆలయాన్ని ఎవరు నిర్మించారు..? ఆ ఆలయం అసలు ఎక్కడ ఉంది..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
సప్త గిరులు సకల దేవతల నిలయంఆ ఆనంద స్వరూపిణి దర్శనానికి నిత్యం దేవతలు, మహా ఋషులు వస్తుంటారట. ఆ దేవతలు, ఋషులు, శ్రీవారిని ఆనంద నిలయంలో కాకుండ తిరుమలలో మరో శ్రీవారి ఆలయానికి వెళ్తూ ఉంటారట. ఈ విషయాన్ని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు దృవీకరించారు. బ్రహ్మాది దేవతలు, సమస్త గణాలు, సప్త ఋషులు, అష్ట దిక్పాలకులు ఈ కలియుగంలో శ్రీ మహా విష్ణువు ధరించిన శ్రీ శ్రీనివాసుని అవతారాన్ని తరించి సేవించి స్వామి అనుగ్రహాన్ని పొందుతారని అంటున్నారు.
స్వయంభూమన్మంత్ర కాలంలో ఆది కృతయుగంలో వైకుంఠం నుంచి భూలోకానికి శ్రీ శ్రీదేవి, భూదేవి సమేతుడై అవతరించాడట. ఈ వెంకటాచల పర్వతంపై శ్వేతవరాహ కల్పం చివరికి వరకు వేంచేసి ఉంటానని బ్రహ్మాది దేవతలకు శ్రీవారు సెలవిచ్చారట. వెయ్యి స్తంభాలతో… అనేకమైన గోపురాలు, ప్రాకారాలతో మహత్తరమైన దేవాలయాన్ని నిర్మించాలని సేవ శిల్పి విశ్వకర్మకు సూచించారట. అందులో తాను వేంచేసిన ఉంటానని శ్రీశ్రీనివాసుడు చెప్పారట. స్వామి వారు చెప్పినట్లు విశ్వకర్మ దేవాలయాన్ని నిర్మిస్తారట.
తరతరాల తిరుమలలో తనివితీరని మహిమలు ఎన్నో, మరెన్నో ఇక్కడ నిక్షిప్తం అయ్యాయి. స్వయం భూమన్మంత్ర కాలంలో నిర్మించిన శ్రీవారి ఆలయం ఇప్పటికీ భూమండలం పై వెంకటాచల పర్వతాల్లో అదృశ్యంగా దివ్యమైన దేవాలయంగా ఉందని స్వామి వారు సజీవంగా సకల పారిషద్ లను అందుకుంటున్నారని వెంకటాచల మహత్యం చెప్తుంది. భౌతికమైన జీవితాలను అనుభవించే మానవ మాతృలకు కనిపించదని అంటున్నారు.