ఆంధ్ర ప్రదేశ్
టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ సింఘాల్

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తొలుత స్వామి వారిని దర్శించుకున్నారు. ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌తో చైర్మన్ బీఆర్ నాయుడు ప్రయాణ స్వీకారం చేయించారు.
అనంతరం రంగ నాయకుల మండపంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు వేద పండితులు స్వామి ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. ఐదేళ్ల అనంతరం మళ్లీ ఈవోగా రావడం ఆనందంగా ఉందని అనిల్ కుమార్ తెలిపారు. దేవుడి ఆశీస్సులతో రెండోసారి ఈవోగా అవకాశం వచ్చిందన్నారు.



