UP: తవ్వకాల్లో బయటపడ్డ పంచముఖి శివలింగం

UP: భారత దేశం ప్రాచీన సంస్కృతికి పుట్టినిల్లు. మన దేశంలో అనేక పురాతన కట్టడాలు, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అందుకే దీనిని వేదభూమి అంటారు. దీనిని రుజువుచేస్తూ పలు చోట్ల తవ్వకాల్లోనో, నదీ ప్రవాహాల్లోనో దేవతా విగ్రహాలు బయటపడుతూ ఉంటాయి. అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. శ్రావణ మాస ప్రారంభంలోనే ఉత్తరప్రదేశ్ లో ఓ ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ యోగీ అడ్డాలో చోటుచేసుకున్న ఆ ఘటన ఏంటి..? ఎందుకు భక్తులు తండోపతండాలుగా అక్కడి వెళ్తున్నారు..?
ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ సంచలనాలకు వేదికైంది. ఇటీవల మసీదు వివాదంతో మొదలైన అలజడి తాజాగా బయటపడుతున్న పురాత కట్టాడల వ్యవహారం ఆసక్తి పెంచుతోంది. పాత ఆలయాలు, విగ్రహాలు, శివలింగాలు, బావులు సొరంగాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా కొలను తవ్వుతుండగా పంచముఖి శివలింగం బయట పడింది. ఈ శివలింగం చాలా పురాతనమైనదని చెబుతున్నారు నిపుణులు. ఇవే ఇప్పుడు దేశవ్యాప్తంగా అతిపెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
యూపీలోని బదాయూ జిల్లా దాతాగంజ్ తహసీలు పరిధి సరాయ్ పిపరియా గ్రామంలో కొలను తవ్వుతుండగా పంచముఖి శివలింగం బయటపడింది. ఇది దాదాపు 300 ఏళ్ల కిందటిది కావొచ్చని స్థానిక పూజారి తెలిపారు. ఇక ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల వారికి తెలియడంతో పంచముఖి శివలింగాన్ని చూసేందుకు పోటెత్తారు.
తన 13 ఎకరాల స్థలంలో తామరు కొలను ఏర్పాటుకు ఈ తవ్వకాలు చేపట్టినట్లు నర్మదా బచావో ఆందోళన్ కార్యకర్త, పర్యావరణవేత్త శిప్రా పాఠక్ తెలిపారు. ఈ స్థలంలోనే పంచతత్వ పౌధ్‌శాల పేరిట ఆమె నర్సరీని కూడా పెంచుతున్నారు. తన ఫౌండేషన్ ద్వారా యేటా 5 లక్షల మొక్కల పంపిణీ లక్ష్యంగా పెట్టుకొన్న పాఠక్ శివలింగం ఆవిర్భావాన్ని భగవదనుగ్రహంగా పేర్కొన్నారు. కాగా, శివలింగం పరిశీలనకు పురావస్తుశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
అలాగే.. యూపీలో పురాతన మెట్ట బావి, హనుమాన్ విగ్రహం బయటపడింది. దాని కిందనే శివలింగం బయటపడింది. నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. పురాతన ఆలయాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. మరో చోట 60 ఏళ్ల క్రితం నాటి సొరంగ మార్గం, మెట్లబావి కనిపించాయి. ఈ పరిణామాలు సాంస్కృతిక ఆనవాళ్లపై చర్చకు దారితీశాయి.
సొరంగం, మెట్ట బావి బ్రిటిష్‌పాలనలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా 1857లో తిరుగుబాటుదారులు తప్పించోవడానికి ఈ సొరంగం ఉపయోగించినట్లు తెలుస్తోంది. 150 ఏళ్ల క్రితం నాటి మెట్ల బావి కూడా ఉన్నట్లు గుర్తించారు. మెట్ల బావిపేరు రాణీకి బావ్డీ చెబుతున్నారు.ఇక 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న మెట్ల బావిని రెవెన్యూ రికార్డులో చెరువుగా నమోదు చేశారు.
ప్రస్తుతం దానికి నష్టం జరుగకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ స్థలం చుట్టూ అక్రమ కట్టడాలు తొలగిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంతోపాటు మరో ఐదు ప్రాంతాల్లో ఐదు పుణ్యక్షేత్రాలు, 19 బాలువు ఉన్నట్లు సర్వే చేసింది.
మరోవైపు, ఉత్తరాదిలో శ్రావణ మాసం సందర్భంగా కన్వర్ యాత్ర కొనసాగుతోంది. యాత్ర చివరి దశకు చేరుకోవడంతో గంగా తీరానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘాజియాబాద్‌లోని దూధేశ్వర్ నాథ్ ఆలయాన్ని సందర్శించి, శ్రావణ కావడి మేళాను అధికారికంగా ప్రారంభించారు. అయితే ఆ పవిత్ర యాత్రపై పాకిస్తాన్ ఉగ్రవాదుల కన్నుపడింది.
నేరుగా భారత్‌ను టచ్ చేయలేక పరోక్షంగా విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు కన్వర్ యాత్రను లక్ష్యం చేసుకోవడమే కాక బజరంగ్ దళ్‌ను ఉన్మాదులుగా చూపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. యాత్రను భగ్నం చేయడానికి చేసే ఎటువంటి ప్రయత్నాలను తాము సహించబోమని, అలాంటి అనుమానాస్పద వ్యక్తుల గురించి కన్వర్ యాత్రికులు, శివ భక్తులు అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రకటించారు.
మహాశివరాత్రికి ముందు శివలింగం దొరకడం శుభసూచకమని గ్రామస్థులు చెబుతున్నారు. ఆ పంచముఖ శివలింగాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. నమ్మకాలతో పనిలేదు. నిజమైన భక్తి ఉంటే అద్భుతాలు వాటంతట అవే జరుగుతాయని అక్కడి స్థానికులు నమ్ముతున్నారు. ఇప్పుడు భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడని, ఇక్కడే శివాలయాన్ని నిర్మిస్తామని అధికారులు ప్రటకించారు.