సినిమా
Allu Arjun New Look: అల్లు అర్జున్ న్యూ లుక్.. ఫొటోలు వైరల్..

Allu Arjun New Look: సంధ్య ధియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కి రెగ్యులర్ బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేడు నాంపల్లి కోర్టుకు హాజరైన బన్నీ బెయిల్ పత్రాలు సమర్పించారు. న్యాయమూర్తి ముందు హాజరైన బన్నీ రూ.50 వేలు చొప్పున రెండు పూచీకత్తులకు సంబంధించిన పత్రాలను సమర్పించారు.
అయితే బెయిల్ పత్రాలు సమర్పించడానికి వచ్చిన అల్లు అర్జున్ కొత్త లుక్‌తో దర్శనమిచ్చాడు. గత 5 ఏండ్లుగా పుష్ప 2 సినిమా కోసమని గడ్డంతో పాటు జుట్టు పెంచిన అల్లు అర్జున్ తాజాగా అవి తీసేసి న్యూ లుక్‌తో దర్శనం ఇచ్చాడు. చాలా రోజులకు బన్నీ సాధారణ హెయిర్‌స్టైల్‌తో కనిపించడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి.