ఆంధ్ర ప్రదేశ్
అంబటి రాంబాబు ఇంటికి నిప్పు

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య వార్ ముదురుతోంది. వైసీపీ నేతలపై వరుస దాడులు జరుగుతున్నాయి. మాజీ మంత్రులు అంబటి, జోగి రమేష్, విడదల రజినిపై దాడులు చేశారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లకు నిప్పు పెట్టారు. దాడులను వైసీపీ అధినేత జగన్ ఖండించారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన నడుస్తోందంటూ ఫైరయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. కేంద్ర బలాగాలను పంపించాలని కోరుతోంది. రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్ర హోం శాఖకు వైసీపీ ఫిర్యాదు చేసింది.



