పుష్ప 2 హవా: ఆగని అల్లు అర్జున్ రికార్డుల సునామీ!

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో హిందీ మార్కెట్‌లో సంచలనం సృష్టించాడు. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం, టీవీ ప్రీమియర్‌లో ఐపీఎల్ రికార్డులను బద్దలు కొట్టింది. నార్త్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించిన పుష్ప రాజ్, కొత్త ఒరవడి సృష్టించాడు.
పుష్ప 2 హిందీ సినిమా రంగంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ రికార్డులను చెరిపేసింది. ఉత్తర భారతదేశంలో భారీ కలెక్షన్లతో దూసుకెళ్లిన ఈ సినిమా, స్త్రీ 2 రికార్డులను అధిగమించి బాక్సాఫీస్‌పై ఆధిపత్యం చాటింది.
టెలివిజన్ ప్రీమియర్‌లో 5.1 టీవీఆర్ సాధించి, ఐపీఎల్ 2025 సగటు రేటింగ్ 4.6ను మించి అసాధారణ ఘనత సొంతం చేసుకుంది. హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్న పుష్ప రాజ్ పాత్ర, అల్లు అర్జున్‌ను నార్త్ మార్కెట్‌లో స్టార్‌గా నిలబెట్టింది. ఈ సినిమా సృష్టించిన హైప్ సోషల్ మీడియాను కూడా షేక్ చేసింది. పుష్ప 2తో అల్లు అర్జున్ సినీ చరిత్రలో కొత్త అధ్యాయం రాశాడని చెప్పొచ్చు.