అంతర్జాతీయం

America: పైనపటారం, లోనలొటారం.. ట్రంప్‌కు కొత్త టెన్షన్

America: పైనపటారం… లోనలొటారం… అమెరికా తీరిది. అగ్రరాజ్యం అప్పుల కుప్పగా మారుతోంది. రోజురోజుకు అమెరికా అప్పులు ఎక్కువైపోతున్నాయి. 2025 నాటికి అమెరికా ప్రభుత్వ రుణం 36.2 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 3,035 లక్షల కోట్లు. ఏటా 1 ట్రిలియన్ డాలర్ రుణం పెరుగుతోంది. ఊపర్ షేర్వానీ, అందర్ పరేషానీలా తయారైంది అమెరికా ఆర్థిక వ్యవస్థ.

పేద దేశాలే కాదు, అగ్రరాజ్యమూ అప్పులకుప్పగా మారుతోంది. సగటున ఒక్కో అమెరికా పౌరుడిపై 91 లక్షల అప్పు ఉంది. కొన్ని దశాబ్దాలుగా అమెరికా అప్పులు ఏటేటా పెరుగుతోంది. 2000 సంవత్సరంలో 5.7 ట్రిలియన్‌ డాలర్ల అప్పు ఉండగా 2020 నాటికి 23.2 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. 2025 నాటికి 36.2 ట్రిలియన్‌ డాలర్లకు పెరిగింది. ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల విలువ కంటే అమెరికా అప్పులే అధికం. అప్పు అంటే అమెరికా, అమెరికా అంటే అప్పు అన్నట్లుగా తయారైంది పరిస్థితి.

ట్రెజరీ బాండ్ల కొనుగోలు ద్వారా అమెరికాకు రుణాలు ఇచ్చే దేశాల జాబితాలో జపాన్, చైనా, యునైటెడ్ కింగ్‌డమ్ ముందున్నాయి. 36.2 ట్రిలియన్ డాలర్ల అమెరికా అప్పులో మూడొంతులు 27.2 ట్రిలియన్ డాలర్లు దేశీయంగానే ఉన్నాయి. అందులో US ప్రైవేట్ సంస్థల వద్ద 15.16 ట్రిలియన్ డాలర్లు ఉన్నాయి. అవికూడా ఎక్కువగా పొదుపు బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ రూపంలో ఉన్నాయి. 7.36 ట్రిలియన్ డాలర్లు US అంతర్-ప్రభుత్వ సంస్థలు, ట్రస్టుల వద్ద ఉన్నాయి. 4.63 ట్రిలియన్ డాలర్లు ఫెడరల్ రిజర్వ్ వద్ద ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

అగ్రరాజ్యంలో అప్పులు కొత్తేం కాదు. పీకల్లోతు అప్పుల్లో అమెరికా కూరుకుపోయింది. US ట్రెజరీ డిపార్ట్‌మెంట్ వెల్లడించిన డేటా ప్రకారం ఆ దేశ ప్రభుత్వ రుణం 36.2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. తాజాగా కొత్త టారిఫ్స్, వ్యయ బిల్లుల కారణంగా అమెరికా అప్పులు మరింత
పెరిగే ఛాన్స్ ఉంది.

అప్పుల ఊబి డొనాల్డ్‌ ట్రంప్‌నకు పెద్ద సవాల్‌గా మారింది. రుణాలపై పెరుగుతున్న వడ్డీ భారంతో పాటు ద్రవ్యోల్బణం దడపుట్టిస్తోంది. దీనికి తోడు అమెరికా డాలర్ విలువ పతనం కలవరపెడుతోంది. ఇతర దేశాల కరెన్సీల్లో బంగారం చౌకగా లభిస్తుంది. దీంతో డిమాండ్ ఎక్కువై గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button