ప్రశాంత్ నీల్‌తో అల్లు అర్జున్ కొత్త సినిమా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినీ ప్రయాణంలో మరో సంచలనం! కోలీవుడ్ దర్శకుడు అట్లీతో భారీ ప్రాజెక్ట్ తర్వాత, ఇప్పుడు మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయనున్నట్టు సమాచారం. ఈ కలయిక ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో పాన్-వరల్డ్ స్థాయి సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన లైనప్‌లో సందీప్ రెడ్డి వంగతో ఓ భారీ చిత్రం హోల్డ్‌లో ఉంది. అయితే, తాజాగా మరో బజ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో బన్నీ ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించనున్నారని, ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
గతంలో త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందని ఊహాగానాలు వినిపించినా, అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ప్రశాంత్ నీల్‌తో బన్నీ కలయిక ఖాయమైతే, అభిమానులకు పండగే! ఈ సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ, ఈ కాంబో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి.