సినిమా
Akhanda 2: కోర్టు ఉత్తర్వులు అంటే లెక్క లేదా..? బుక్ మై షోపై హైకోర్ట్ ఆగ్రహం

Akhanda 2: అఖండ -2 టికెట్ల వివాదంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టులో ఉత్తర్వులను పాటించామని హొంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాదించారు. పెంచిన టికెట్ రేట్లను నిన్నే రద్దు చేశామని వెల్లడించారు. బుక్ మై షో పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోర్టు ఉత్తర్వులు అంటే లెక్క లేదా అని ప్రశ్నించింది. అయితే తమకు ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారని బుక్‌మై షో తెలిపింది. పెంచిన రేట్లతోనే అఖండ-2 టికెట్లను ఇప్పుడు విక్రయిస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది.



