సినిమా

అజిత్ లేటెస్ట్ లుక్ షాకింగ్!


Ajith Kumar: తమిళ స్టార్ అజిత్ కుమార్ ఈ ఏడాది రెండు బ్లాక్‌బస్టర్ చిత్రాలతో అభిమానులను అలరించారు. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఆయన లుక్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తమిళ సినీ రంగంలో స్టైలిష్ హీరోగా పేరున్న అజిత్ కుమార్ ఈ సంవత్సరం ‘పట్టుదల’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాలతో అభిమానులకు వినోదాన్ని పంచారు. ఈ సినిమాల్లో డైనమిక్ లుక్‌తో ఆకట్టుకున్న ఆయన, ప్రస్తుతం ఫ్యాషన్ రేసింగ్‌లో బిజీగా ఉన్నారు. కానీ, ఇటీవల వైరల్ అయిన అజిత్ ఫొటోలు ఫ్యాన్స్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి.

54 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్‌తో ఆకర్షించే అజిత్, ఈ కొత్త లుక్‌లో చాలా బలహీనంగా, వయసు మీదపడినట్లు కనిపిస్తున్నారు. ఆయన హెయిర్‌స్టైల్ కూడా అభిమానులకు నచ్చక, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ మార్పు వెనుక ఆరోగ్య కారణాలా, లేక కొత్త సినిమా కోసమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అజిత్ త్వరలోనే తన స్టైలిష్ లుక్‌తో మళ్లీ ఆకట్టుకుంటారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button