సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ

తిరుమల శ్రీవారిని నటి శ్రియా దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమల చేరుకున్న శ్రియా తల్లితో కలసి ఇవాళ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.



