కల్పికకు మానసిక సమస్యలు.. తండ్రి సంచలన ఫిర్యాదు!

Kalpika: సినీ నటి కల్పిక గణేష్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఆమె తండ్రి సంఘవార్ గణేష్ గచ్చిబౌలి పోలీసులకు సంచలన ఫిర్యాదు చేశారు. కల్పిక మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతోందని, ఆమె వల్ల ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
టాలీవుడ్ నటి కల్పిక గణేష్ మానసిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె తండ్రి సంఘవార్ గణేష్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్పిక డిప్రెషన్, బార్డర్‌లైన్ నార్సిస్టిక్ డిసార్డర్‌తో బాధపడుతోందని, రెండేళ్లుగా మందులు వాడకపోవడంతో ఆమె పరిస్థితి దిగజారిందని తెలిపారు. గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిన ఆమె, తరచూ గొడవలు సృష్టిస్తూ కుటుంబానికి, సమాజానికి ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
2023లో ఆశ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ, రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఉండకుండా వచ్చేసిందని చెప్పారు. ఆమెను మళ్లీ చికిత్స కోసం రిహాబ్ సెంటర్‌కు తరలించాలని పోలీసులను కోరారు. ఈ ఫిర్యాదు సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.