సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డెకాయిట్ సినిమా బృందం

తిరుమల శ్రీవారిని డెకాయిట్ సినిమా బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు అడివి శేష్, నటి మృణాల్ ఠాకూర్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారి ప్రసాదాల నాణ్యత, రుచిపై నటీనటులు హర్షం వ్యక్తం చేశారు. అడివి శేష్, మృణాల్ జంటగా నటించిన ‘డెకాయిట్’ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తిరుపతిలో చిత్రంలోని రుబారూ పాటను విడుదల చేసినట్లు శేష్ తెలిపారు.



