తెలంగాణ
కామారెడ్డి జిల్లాలో ఆర్టీఏ చెక్‌పాయింట్ దగ్గర ఏసీబీ రైడ్స్

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శిశారు ఆర్టీఏ చెక్‌పాయింట్ వద్ద ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తుల నుంచి మనీని ఏసీబీ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీఏ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్యామ్‌ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు.