జాతియం
Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడి.. టూరిస్టులపై కాల్పులు

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకుల బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆరుగురు పర్యాటకులు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిలో ముగ్గురు స్థానికులు కాగా, ముగ్గురు స్థానికేతరులు ఉన్నట్లు తెలుస్తుంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఉగ్రవాదులను వేటాడేందుకు భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.