ఆంధ్ర ప్రదేశ్
తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

తిరుమల నడకమార్గంలోని అవ్వచారి కోన వద్ద ఓ వ్యక్తి లోయలోకి దూకాడు. భక్తులు గుర్తించి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. విజిలెన్స్ అధికారులు అతడిని లోయ నుంచి బయటకు తీసి తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి దోర్నపాడుకు చెందిన బోయ మాధవ రాయుడు అని విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు.