TDP: తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం

TDP: ఎదుర్కొంటోంది. దేశంలో, రాష్ట్రంలో కూటమిలో కీలక భూమిక పోషిస్తోంది. ఐతే తెలుగుదేశం పార్టీ ముందు ఎన్నో సవాళ్లున్నాయ్. పైకి అంతా మంచిగా కన్పిస్తున్నా కూటమిలో భాగంగా ఉండటంతో వచ్చే రోజుల్లో ఆ పార్టీ ఏ విధంగా రాజకీయాలు చేస్తోందన్నదానిపై ఎంతో యాంబిగ్విటీ ఉంది. మరీ ముఖ్యంగా కూటమి వచ్చే పదిహేనుళ్లు కలిసి ఉండాలని పవన్ కల్యాణ్ చెబుతున్నారు.
చంద్రబాబు నాయకత్వం మరో రెండు టర్మ్‌లు అవసరమంటున్నారు. మరోవైపు సంకీర్ణ రాజకీయాలు మొత్తం ఎటు నుంచి ఎటువైపునకు రాజకీయ మారుతుందో చెప్పలేని పరిస్థితి. 43 ఏళ్ల టీడీపీపై రాజ్ న్యూస్ ఆఫ్ ద రికార్డ్
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. మొదటి నుంచి బడుగు బలహీన వర్గాల పార్టీగా ముద్ర వేసుకుంది. నాడు అన్న నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీని ఆ తర్వాత నారా చంద్రబాబునాయుడు తీర్చిదిద్దారు.
సంక్షేమ పాలనతో ఎన్టీఆర్ తెలుగు నేలపై కూడు, గూడు, గుడ్డ అందరికీ అందేలా చేస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హైటెక్ సంస్కరణలతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు లక్ష్యాన్ని చేసి చూపించారు ఎన్టీఆర్. అదే పంథాను నేటికీ కొనసాగిస్తున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.
43 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాల ఎదుర్కొని నిలబడింది. అధికారంలోకి రావడం, పోవడం కామన్. అయినప్పటికీ ప్రజాక్షేమాన్ని తెలుగుదేశం పార్టీ కోరుకుంది. పార్టీ స్థాపించిన సగం కాలం పార్టీ అధికారంలో కొనసాగింది. మరో దశాబ్దం అధికారంలో కొనసాగేలే పార్టీకి గత ఎన్నికల్లో ఫౌండేషన్ ఏర్పడింది. సమస్యలు, సవాలను ఎదుర్కోవడం తెలుగుదేశం పార్టీకి వెన్నతో పెట్టిన విద్య.
నాడు నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ పేదల కోసం పనిచేసేలా తీర్చిదిద్దితే, నేడు నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధికి నిలువుటద్దంలా చేశాడు. తెలుగుదేశం పార్టీ రూపురేఖలను బాబు మార్చేశారు. దేశంలో సంపన్న పార్టీగా మాత్రమే కాదు. జవాబుదారుగా మార్చారు. తెలుగుదేశం పార్టీని దేశంలోనే ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా మార్చారు.
కేంద్రంలో అధికారంలో ఎవరన్నా తెలుగుదేశం పార్టీ అవసరం తప్పక వచ్చేలా పరిస్థితులు రావడం కూడా ఆ పార్టీకి కలిసొచ్చాయని చెప్పాల్సి ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల భాగ్యంగా కూడా చెప్పుకోవాలి. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ అన్ని విధాలా రాష్ట్రానికి ప్రయోజనం కలిగేలా చంద్రబాబు యూక్తి ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు.
నాడు హైదరాబాద్ ను పూర్తిస్థాయిలో డెవలప్ చేసిన ఆయన ఇప్పుడు అమరావతి ఖ్యాతిని ఒక రేంజ్‌కు తీసుకెళ్లాలని తపిస్తున్నారు. తెలుగు జాతి ఇప్పుడు ఒక కొత్త పొందిక సిద్ధంగా ఉంది. వచ్చే రోజుల్లో సమస్యలు సవాళ్లను అధిగమించి దక్షిణాదిలో తెలుగుదేశం పార్టీ పాగా వేసేలా అడుగులు వేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో పార్టీని రివైవ్ చేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
అండమాన్ లోనూ పార్టీ శాఖ బలంగా ఉంది. జాతీయస్థాయిలో చక్రం తిప్పుతున్న తెలుగుదేశం పార్టీ వచ్చే రోజుల్లో పలు రాష్ట్రాల్లో కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. తమిళనాడు, కర్నాటకలో తెలుగువారి కోసం టీడీపీ ఎప్పుడు పనిచేస్తూనే ఉంది. ఒడిశా సంక్షోభంలోనూ ఆపన్నహస్తం అందించింది. దేశంలో ఏ సమస్య వచ్చినా నేనున్నాంటోంది తెలుగుదేశం పార్టీ. అయితే పార్టీకి 43వ సంవత్సర వేడుక ఒక గొప్ప మరపురాని అంశమే అయినా సవాళ్లు కూడా ఎదురవుతున్నాయ్.
అన్నింటికీ మించి నారా వారసుడు లోకేష్ వచ్చే రోజుల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో లోకేష్ ఉండగా, అటు ప్రభుత్వంలోనూ కీలక శాఖలను ఆయన నిర్వరిస్తున్నారు. పార్టీ నేతలు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటోడటం, మరోవైపు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రిగా ఉండటం కూటమిలో కీలక పాత్రలో బీజేపీ ఉండటం వచ్చే రోజుల్లో పవనాలు ఎటు నుంచి ఎటువైపునకు మారతాయోనన్న అనుమానాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తుంటే కూటమి మరో 15 ఏళ్లు సాగుతోందని అటు పవన్ కల్యాణ్, ఇటు చంద్రబాబునాయుడు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఎనీటైమ్ ఎనీ థింగ్ జరగొచ్చు. జరక్కపోవచ్చు అందుకే కాల పరీక్ష ప్రతి ఒక్కరికీ తప్పదు.